శిక్షణ కేంద్రం పరిశీలన
మల్కన్‌గిరి: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం నిర్వహిస్తున్న నివాస శిక్షణ కేంద్రాన్ని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదివారం పరిశీలించారు. విద్యార్థుల విజయానికి అవసరమైన సూచనలు, సూత్రాలను తెలియజేశారు. మల్కన్‌గిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026లో పదో తరగతి బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు చేపట్టిన ఈ నివాస శిక్షణ కేంద్రం, మల్కన్‌గిరి సమితి ఎంవి 7 గ్రామం వద్ద జగన్నాథ్‌పల్లి ఉన్నాత పాఠశాల, కలిమెల సమితిలో ఉన్నత పాఠశాలలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపికై న 200 మందికి నాలుగు కేంద్రాల్లో ఉంచి ఉచిత భోజనం, విద్యా సామగ్రీ, ప్రత్యేక నిపుణులతో బోధన, రోజువారీ పరీక్షలను పరీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా విద్యశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి, నివాస కేంద్రాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎ.ఈశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


