రాయగడలో మినీ మారథాన్
రాయగడ: అందరికీ విద్య అన్న నినాదంతో కిస్, కిట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదివారం సదరు సమితి కూలి పంచాయతీలో మినీ మారథాన్‌ను నిర్వహించాయి. కిస్ సంస్థ రాయగడ జిల్లా అధ్యక్షుడు మాఝి పిడిక, ఆ సంస్థలకు చెందిన విద్యార్థులు, రాయగడ సమితి వైస్ చైర్మన్ హర ప్రసాద్, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్, సీనియర్ పాత్రికేయుడు అమూల్య కుమార్ సాహులు హాజరై ర్యాలీని ప్రారంభించారు. కూలి పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన మారథాన్ చిల్డ్రన్స్ పార్క్ వరకు కొనసాగింది. కూలి, బాయిసింగి, డంగలొడి, పంచాయతీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో మారథాన్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొన్న యువతకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు.


