నమ్మినందుకు మళ్లీ నగుబాటు!
పోలాకి:
పోలాకి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాం గ్రామం. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారంతా పెద్దపండగ సంక్రాంతికి సొంతూరు రావటంతో గ్రామంలో చిన్న సందడి.. గ్రామంలోని కణితోళ్ల ఇంటి వద్ద ఉన్న రచ్చబండపై కూర్చున్నారు గ్రామానికి చెందిన రైతు చింతాడ నూకయ్య, రైతు కూలీ సంపతిరావు వేణు. వీరిద్దరూ వ్యవసాయం గురించి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన ఎల్‌ఐసీ ఏజెంట్ కణితి కృష్ణ పలకరించాడు. డబ్బుల కోసం అడగ్గా.. ఇంకా ధాన్యం డబ్బులు అందలేదు పండగ వెళ్లాక కిస్తీ కడతాను అన్నాడు నూకయ్య.
కృష్ణ: అదేంట్రా తమ్ముడు.. లేటైతే ఫినాల్టీ కట్టాలి. ఇంటిదగ్గర డబ్బులుంటే చూసి కట్టేయకూడదు.
నూకయ్య: ఇంకెక్కడ డబ్బులురా అన్నా.. ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు ధరలేదు, ఎరువులు దొరకటం లేదు. మిల్లులు చుట్టూ తిరగలేక, సచివాలయం దగ్గర నిలబడ లేక ధాన్యం దళారీలకి ఇచ్చాను. ఇంకా డబ్బులు అందలేదు. ఈలోగా పండగ వచ్చేసింది. చుట్టాలు, బంధువులు, పిల్లలు వస్తారు కదా..
(ఇంతలోనే అటుగా వచ్చిన యువకులను చూసి వీరు ముగ్గురూ ఆప్యాయంగా పిలిచారు. నాయనా బాగున్నార్రా అందరూ.. పండక్కి వచ్చారా..? మీరుంటే ఊరు కళకళలాడుతాదిరా అన్నారు. వెంటనే వారి దగ్గరకు వచ్చిన కుర్రాళ్లు కణితి సంతోష్, కిల్లి లచ్చుమునాయడు(హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు), సంపతిరావు గోవిందరాజు (టెక్నికల్ మెంబర్, జిందాల్ స్టీల్స్, ఛత్తీస్‌గఢ్), కిల్లి తిరుపతి(వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయ్) ఏంటి దద్దా డిమ్ముగా వున్నారు అనడిగారు.
నూకయ్య: ముసిలోళ్లం.. డిమ్ముగా కాకపోతే మీలా ఉండగలమా..?
లచ్చుమునాయుడు: మీ పనే బాగుంది పింఛన్ అందుతుంది కదా?
నూకయ్య: ఏం పింఛన్‌రా.. నిలువునా మునిగిపోయాం. యాభై సంవత్సరాలకు పింఛన్ ఇస్తానన్నారు. నాకు అరవయ్యొక్కటి..ఇదిగో వేణుకి యాభైనాలుగు వచ్చినాయి. మా ఇద్దరికే కాదు మా వయసున్నోళ్లు చాలామంది ఉన్నా
ఊళ్ల నుంచి జనాలైతే వచ్చారు. కానీ ఏం కొందామన్నా డబ్బుల్లేవు. ధాన్యం ధర గిట్టుబాటు కాలేదు. తీసుకున్న ధాన్యానికి ఇచ్చే కొద్దిపాటి సొమ్మైనా ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇత్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా విగ్రహాలకు, ఆడంబరాలకు వందల కోట్లు తగలేస్తున్నారు. ఈ ప్రభుత్వం సంగతి తెలిసినా మళ్లీ ఓట్లేసి గెలిపించి మోసపోనాం.. ఇంకేం పండుగ చేసుకుంటాం.


