సర్వం సిద్ధం
సంగమేశ్వర జాతరకు..
● సర్వమత సమ్మేళనం ఇక్కడి ప్రత్యేకత
● నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
ఆమదాలవలస రూరల్: గాజులు కొల్లివలస సంగమేశ్వర జాతరకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 12వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మితమైందని పురావస్తుశాఖ కూడా గుర్తించటంతో రాష్టంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమదాలవలస పట్టణ సమీపంలోనే ఈ ఆలయం ఉంది.
ఎన్నో ప్రత్యేకతలు..
చరిత్రాత్మక నిలయంగా చెప్పుకుంటున్న సంగమేశ్వర ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. కొండపై రాతితో చెక్కిన శివ లింగంతో పాటు శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
మూడు మతాల సమ్మేళనం
ఆమదాలవలస సంగమేశ్వర ఆలయం సర్వమత
సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి కొండపై బౌద్ధ, జైన, శైవ అనే మూడు మతాలు ఒక్కో చోట చేరటం ఇక్కడి ప్రత్యేకత. మూడు మతాలు ఇక్కడ ఉండటం వల్ల సంగమేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారని ప్రతీతి. మత సంగమం సాధారణంగా నదీ సంగమంలో ఉంటాయని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడ ఎటువంటి నదులు లేనప్పటికీ కొండపై మూడు మతాలు సమ్మేళనంగా ఉండటం విశేషం. శివుడితో పాటు బుద్ధుడు, జైన తీర్ధంకుల విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు.
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం


