రోడ్డెక్కిన రైతులు..
నిలిచిన వాహనాలు
కొరాపుట్: ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తుండడంపై రైతులు రోడ్డెక్కారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రం నుంచి కొసాగుమ్డ మార్గంలో రాస్తారోకో చేశారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం (మండీ) వద్ద వందలాది రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నారు. 15 రోజుల కిందటే రైతుల ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం అనుమతి టోకెన్‌లు ఇచ్చింది. కానీ మిల్లర్లు ఆ ధాన్యం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. టోకెన్ పొందిన రైతు ధాన్యంని మిల్లర్లకి అప్పగించే బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విసుగెత్తిన రైతులు రహదారి దిగ్బంధించారు. ఇది తెలిసి డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జి, సమితి వైస్ చైర్మన్ సుశాంత్ బెహరా తదితరులు ఈ ఆందోలనలో పాల్గొన్నారు. దీంతో అధికారులు దిగి వచ్చి మిల్లర్ల చే ధాన్యం కొనుగోలు చేయించారు.
రోడ్డెక్కిన రైతులు..


