ఐదు అంబులెన్స్‌లు మంజూరు
రాయగడ: రాష్ట్ర ఆరోగ్య శాఖ రాయగడ జిల్లాకు మరో ఐదు ఆంబులెన్స్‌లను మంజూరు చేసింది. కొద్ది నెలలుగా పలు ఆంబులెన్స్‌లో యాంత్రిక లోపాల కారణంగా మూలపడి పోవడంతో సకాలంలో సేవలు అందలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మరో ఐదు ఆంబులెన్స్‌లను మంజూరు చేసింది. మంజూరైన వీటిని జేకేపూర్, మునిగుడ, కాసీపూర్, అంబొదల పీహెచ్‌సీలను కేటాయిస్తున్నట్లు జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినీ దేవి తెలిపారు. శుక్రవారం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత కుమార్ మిశ్రో, ఫార్మాసిస్ట్ జగన్నాథనాయక్, ఎన్‌హెచ్‌ఎం డీపీవో లక్ష్మీధర్ మహాపాత్రో, శుభాంశు సేనాపతి, సిబ్బంది పాల్గొన్నారు.


