బ్యాంకు రుణమాఫీ చేయాలని వినతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి మారిబేడా పంచాయతీ ఎంవీ 26 గ్రామానికి చెందిన 20 ఎస్‌హెచ్‌జి సంఘాల మహిళలు శుక్రవారం సమితి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. గత నెల 8న రఖాల్‌గూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లతో పాటు గృహోపకరణాలు, బైక్‌లు, పికప్ వ్యాన్‌లు కాలిపోయాయని, ప్రస్తుతం ఆస్తి నష్టం అంచనా వేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.
బ్యాంకు రుణాలు తీసుకుని పంటలు పండించామని, ఆ రుణాలు మాఫీ చేయాలని వందలాది మంది మహిళలు కోరారు. వారు ఈ వినతి పత్రాన్ని సమితి కార్యాలయంలో సమితి అధికారి అమూల్య కుమార్ సాహు అందుబాటులో లేకపోవడం తో సీనియర్ క్లర్క్ జనార్ధన్ హంతాళ్‌కు అందజేశారు.


