
హత్య కేసులో ఆరుగురి అరెస్టు
రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి శెశిఖాల్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సన్నోసిగురు గ్రామానికి చెందిన పరమేశ్వర్ తాడింగి, బలరాం మండంగి, అక్షయ తాడింగి, మేద్రీ జిలకర, మానస్ తాడింగి, రబి కిలకలు ఉన్నారు. సనోసిగురు గ్రామంలో నివసిస్తున్న నారాయణ మండంగి (60) అనే వృద్ధుడిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నాడన్న నెపంతో పది రోజుల క్రితం హత్య చేశారు.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
పర్లాకిమిడి: గుసాని సమితి మధుసూదనపు రం పంచాయతీ తోటగుమ్మడ గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని సోమవా రం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు 54 మంది రోగులకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను అందజేశారు. జై హనుమా న్ మెడికల్ షాపు యజమాని ప్రకాశరావు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: సెప్టెంబరు 13వ తేదీన గజపతి జిల్లా కోర్టు పర్లాకిమిడి, ఆర్.ఉదయగిరి, మో హానా, కాశీనగర్‌లలో తృతీయ రాష్ట్రీయ లోక్ అదాలత్ జరుగనుందని జిల్లా జడ్జి సోమవా రం తెలియజేశారు. విచారణలో ఉన్న కేసులు, చెక్‌బౌన్స్, బ్యాంకు రుణాలు, మోటారు వాహ న దుర్ఘటన నష్టపరిహారం, కార్మిక, లోక్ సేవా, విడాకుల కేసులు విచారణ జరుగుతాయని జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమ ల్ రవుళో తెలిపారు. రాష్ట్రీయ లోక్ అదాలత్ లో విచారణకు ప్రజలకు ఎటువంటి ఆర్థిక భా రం ఉండదన్నారు. ఇతరత్రా వివరాలకు జిల్లా న్యాయ సలహా ప్రాదికరణ కార్యాలయం, ప ర్లాకిమిడి, ఆర్.ఉదయగిరి, మోహానా కోర్టులో కక్షిదారులు సంప్రదించవచ్చని తెలియజేశారు.
పర్లాకిమిడి: పట్టణంలోని రాజగురు వీధిలో గౌరహరి గ్రంథాలయంలో సోమవారం గజప తి జిల్లా మాజీ సైనికుల సంఘం సమావేశం నిర్వహించారు. కెప్టెన్ ఎన్.సీ.దాస్ ఈ సర్వస భ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులకు పింఛన్, తదితర సమస్యలపై చర్చించారు. మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షుడు బి.కె.రావు, మనోజ్ దా స్, భవానీ శంకర్ ఆచార్య, మల్లికార్జున్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
28 నుంచి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శ్రీకాకుళం: జిల్లాలో డీఎస్సీ నుంచి పలు కేటగిరీ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి జరుగుతుందని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని సబ్జెక్టుల జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పత్రాల పరిశీలనకు వచ్చినప్పు డు అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ ధ్రువ పత్రాలు ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, అంగవైకల్య ధ్రువీకరణ పత్రం, కాల్ లెటర్లో సూచించిన ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పారు. అలాగే గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా తీసుకురావాలని సూచించారు. అభ్యర్థు లు వారికి కేటాయించిన తేదీ సమయాల్లో తప్పకుండా పరిశీలనకు హాజరుకావాలని, లేకుంటే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావడానికి ముందు ఆయా పత్రాలను వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతిమ..ప్రతిభ
సారవకోట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు జి.ఉమాదేవి ఆ ధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు తయా రు చేసి పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలే వాడాలని పిలుపునిచ్చారు.

హత్య కేసులో ఆరుగురి అరెస్టు

హత్య కేసులో ఆరుగురి అరెస్టు