
వినతుల వెల్లువ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీలో సోమవారం జిల్లా కలె క్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గ్రీవెన్స్‌లో పాల్గొని వినతు లు స్వీకరించారు. మొత్తం 112 వినతులు అందా యి. సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఓ క్యాంప్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో సేవలు అందిచాల ని ఆయా శాఖల ఉద్యోగులుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ అశ్ని ఎ.ఎల్, చిత్రకొండ బీడీఓ, తహసీల్దార్, జిల్లా ఎన్నికల అధికారి ఆశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.
మునిగుడలో..
రాయగడ: జిల్లాలోని మునిగుడలో సొమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొని 109 వినతులను స్వీకరించారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దిల్లిప్ దుదుల్ అభిషేక్, జిల్లా ముఖ్యవైద్యాధికారి బి.సరోజిని దేవి, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు హాజరయ్యారు. మునిగుడ సమితి పరిధిలో ని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్వీకరించిన వినతుల్లో 91 వ్యక్తిగతమైన సమస్యలు, 18 సామూహిక సమస్యలుగా గుర్తించారు. ఈ సంద ర్భంగా 8 మందికి రూ.1.10 లక్షల ఆర్థిక సహాయా న్ని కలెక్టర్ అందించారు.
మోహనా బ్లాక్‌లో..
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా సమితి ఖరిగు డ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ మధుమితతోపాటు జిల్లా ఎస్పీ జ్యతింద్ర నాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. మోహనా బ్లాక్ ఖరిగుడ పంచాయతీలో రాయిపంక, మండిమర, బిరికోట్ గ్రామాల నుంచి మొత్తం 148 వినతులు అందాయి. వాటిలో గ్రామ సమస్య లు 116 ఉన్నాయి. ఇద్దరు నిస్సహాయులకు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సహాయ నిధి నుంచి రూ.15 వేలు అందజేశారు. మోహనా బ్లాక్ అడవ పంచాయతీ జోమ్మిగుడ గిరిజన పేద విద్యార్థి నిరో మల్లిక్ నీట్ లో విజయం సాధించి బరంపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందినందుకు కలెక్టర్ మెమొంటో అందజేశారు. పలువురికి ఇళ్లు, భూపట్టాలు (ఆర్.ఓ.ఆర్) అందజేశారు. ఈ కార్యక్రమంలో మోహనా బ్లాక్ చైర్మన్ రాజీవ్ శోబోరో, బీడీఓ రాజీవ్ దాస్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, జన స్వస్థ అధికారి డాక్టర్ ఎం.ఎం.ఆలీ, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ