
చవితి పండగ.. ప్రకృతికి అండగా
● మట్టి వినాయకులనే పూజిద్దాం
● స్థానిక వనరులతో పూజలు ● ఉత్సవ కమిటీలకు సూచనలు
శ్రీకాకుళం కల్చరల్: చవితి సంబరానికి అంతా సిద్ధమైంది. కాసిన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే పండగ చూసి ప్రకృతి కూడా నిండు గుండెతో నవ్వుతుంది. మట్టి విగ్రహాలను పూజించడం, ప్లాస్టిక్‌ను వినియోగించకపోవడం, స్థానికంగా దొరికే వస్తువులను వాడడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చవితి మరింత ప్రత్యేకమవుతుంది.
స్థానిక వనరులే మేలు..
గణపతిని పూజించేందుకు ఎన్నో వస్తువులు అవసరమవుతాయి. ఆన్‌లైన్ అనకుండా ఊరిలో వ్యాపారుల వద్ద కొంటే వారికి ఉపాధి దొరుకుతుంది.
మట్టే ముద్దు
చవితి పూజకు మట్టి వినాయకుడిని మించిన విగ్రహం లేదు. మన స్థానిక కుమ్మర్లు ఎంతో ఆకర్షణీయంగా విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇళ్లలో పెట్టుకునేందుకై నా వీరి వద్దే కొంటే పర్యావరణానికే కాదు వారికీ మేలు జరుగుతుంది.
సింథటిక్ శాలువాలు వద్దు
కమిటీ సభ్యులు కొందరిని స త్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో సింథటిక్ శాలువాలతో కాకుండా నేత వస్త్రాలతో సత్కరిస్తే మన నేతన్నలకు ఉపాధి దొరుకుతుంది. విగ్రహానికి వేసే కండువాలను కూడా ఖాదీది వాడితే మేలు.
పాలథిన్ వద్దు..
పూజా సామగ్రిలో వీలైనంత వర కు పాలిథిన్ వస్తువులు వినియోగించకపోవడం మేలు. పాల ప్యాకెట్లు కాకుండా స్థానికంగా దొరికే పాలు వాడుకుంటే ఇంకా మంచిది.
డీజేలు కావాలా..?
వినాయక నిమజ్జనాల్లో డీజేల శబ్దాలు ఉండకపోతేనే మేలు. డీజేలు వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఏర్పడి మనషుల చెవులు, గుండెలకు ఇబ్బందులు వస్తాయి.
ఆహారం వృధా చేస్తున్నారా..?
రోజూ తయారు చేసే ప్రసాదం ఒక వేళ మిగిలిపోతే వృధా చేయవద్దు. పేదలకు అందేలా చూడాలి.

చవితి పండగ.. ప్రకృతికి అండగా

చవితి పండగ.. ప్రకృతికి అండగా

చవితి పండగ.. ప్రకృతికి అండగా

చవితి పండగ.. ప్రకృతికి అండగా