
హిందూ పరిరక్షణకు లక్ష్మణానంద కృషి అభినందనీయం
జయపురం: హిందుత్వ పరిరక్షణకు వేదాంత కేశరీ స్వామి లక్ష్మణానంద సరస్వతి కృషి చిరస్మరణీయ మని పలువురు వీహెచ్‌పీ ప్రతినిధులు అన్నారు. స్థానిక నెహ్రూనగర్‌లోని అగ్రసేన్ భవనంలో విశ్వ హిందూ పరిషత్ 61వ ప్రతిషాదినం సందర్భంగా వేదాంత కేశరీ స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన స్మృతి కార్యక్రమం నిర్వహించారు. వీహెచ్‌సీపీ ప్రాంతీయ ఉపాధ్యక్షులు బాబూ భాయి భజరంగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయపురం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు తేజేశ్వర పండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీహెచ్‌పీ జయ పురం జిల్లా కార్యదర్శి కమళలోచన బిశాయి మాట్లాడుతూ.. వీహెచ్‌పీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునినిచ్చారు. ప్రతి కుటుంబం ప్రతివారిని సభ్యులగా చేర్చేందు కు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జయపురం విభాగ కార్యదర్శి నవకృష్ణ రథో, జిల్లా కోశాధ్యక్షులు గంగాధర నాయిక్, ఒడిశా అమలా సంఘ అధ్యక్షులు శశిభూషణ దాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు నివేదిత రథ్ పాల్గొన్నారు.