
10 మంది గంజాయి నిందితులు అరెస్టు
రణస్థలం: గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రణస్థలం మండలంలోని పైడి భీమవరం భూమాత టౌన్‌షిప్ వద్ద 22.5 కేజీల గంజాయితో ఐదుగురు నిందితులను జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవితో పాటు సిబ్బంది ఈనెల 24న తొలుత పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆ నలుగురి నిందితులకు గంజాయి అమ్మకాలు, కొనుగోలు జరిపిన, సహకరించిన మరో ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నామని చెప్పారు.
ఒడిశా నుంచి గంజాయి
ఈనెల 23వ తేదీన బగాన పవన్ కుమార్, ఇనాకోటి ముకుందాతో కలిసి దినేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఒడిశాలోని కొరాపుట్ దగ్గర ఉన్న పొత్తంగి వెళ్లి గుంత శుక్ర అనే వ్యక్తి దగ్గర 22.5 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గుంత శుక్రకు స్నేహితులను పరిచయం చేస్తానని చెప్పి ముగ్గురు ద్విచక్ర వాహనంపై పైడి భీమవరం వచ్చారు. భూమాత టౌన్ షిప్ వద్ద గంజాయి సేవిస్తూ, తెచ్చిన 22.5 కేజీల 5 ప్యాకెట్లను విభజించి స్నేహితుల ద్వారా అమ్మకాలు జరిపేందుకు పన్నాగం పన్నారు. తుపాకుల అనిల్ కుమార్, లక్కవరపు పవన్ కుమారులు ఇందులో కొంతమొత్తం హైదరాబాద్‌లోని బాడాన సౌమిత్, బెంగళూరులోని మొదలవలస సందీప్‌కు అమ్మడానికి తీసుకుని ఉండగా జేఆర్‌పురం పోలీసులు పట్టుకున్నారు. బగాన పవన్ కుమార్‌పై గతంలో ఎచ్చెర్లలో గంజాయి కేసు నమోదై ఉంది. అరైస్టెనవారిలో బగాన పవన్ కుమార్, ఇనకోటి ముకంద, గుంత శుక్ర, తుపాకుల అనిల్ కుమార్, లక్కవరపుకోట పవన్ కుమార్, లంకపల్లి దినేష్, ఆళ్ల వెంకటరావు, సురవరపు వరప్రసాద్, బనిశెట్టి భాను వెంకటప్రతాప్, ముడిల మోహన్ వెంకట ప్రతాప్‌లు ఉన్నారు.