
జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు
శ్రీకాకుళం కల్చరల్: భారత ప్రజాస్వామ్య వ్యవస్థను జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్‌గా నడిపిస్తోందని, అటువంటి జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు కావాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వపు వైస్ చాన్సలర్ డాక్టర్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ యునియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సాక్షి బ్యూరో చీఫ్ కందుల శివశంకర్‌కు డీకే అవార్డు, జనదీపిక పత్రిక సంపాదకుడు సున్నపు చిన్నారావుకు శృంగారం ప్రసాద్ స్మారక అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీకే ట్రస్టు కార్యదర్శి దుప్పల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించిన దుప్పల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లి ధర్మారావు, అవార్డు జ్యూరీ సభ్యులు సురేష్‌బాబు, న్యాయవాది బొడ్డేపల్లి మోహనరావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్, యూనియన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెండి నర్సింగరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొంచాడ రవిశంకర్, జి.శ్రీనివాసరావు, ఎంహెచ్ అవార్డు గ్రహీత గేదెల మాధవరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీష్, సనపల రమేష్, గరిమెళ్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎన్నేశ్వరరావు, సామ్నా నాయకులు చౌదరి సత్యనారాయణ, చైతన్య మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు మహారాణ, యోగి, నవీన్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు