
ఐక్యత ముద్దు
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ద్వేషం వద్దు..
● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభం పాటి
భువనేశ్వర్: పౌరులు ద్వేషాన్ని తిరస్కరించి ఐక్యతను బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపు నిచ్చారు. రాజ్ భవన్‌లోని నూతన అభిషేక్ హాల్‌లో గురువారం జరిగిన విభజన భయానక జ్ఞాపకాల దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి హాజరయ్యారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన గాయాలు చెరగని మచ్చలు మిగిల్చాయని, విద్వేష రాజకీయాలు విభజన పరిస్థితుల్ని పునరావృతం చేయరాదని, సహనం, సానుభూతి, న్యాయం ద్వారా ఐక్యతను పెంపొందించుకోవాని గవర్నర్ హితవు కోరారు. విభజన మానవాళి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా గవర్నర్ అభివర్ణించారు. విభజన ప్రభావంతో ఉపఖండం యొక్క సాంస్కృతిక, మతపరమైన బంధాలు విచ్ఛిన్నమై లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మరెందరో ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఏటా ఆగస్టు 14న విభజన భయానక జ్ఞాపకాల దినం ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనీయులని గవర్నర్ కొనియాడారు. భావి తరాలు విషాద విభజన తీవ్రతను అర్థం చేసుకుని బలమైన సమైక్య భారత్ సంరక్షకులుగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విభజన సమయంలో సుదూరంగా ఉన్న ఒడిశా స్థానభ్రంశం చెందిన వారి పట్ల కారుణ్య ప్రతిస్పందన హర్షణీయమని అన్నారు ఈ మానవతా స్ఫూర్తి మన రాష్ట్ర నైతికతలో పెన వేసుకుపోయిందన్నారు. ఈ విలువల ఆదర్శం ప్రామాణికంగా యువత ఈ నేలపై మరోమారు విభజన చీకట్లు కమ్మకుండా విభజన నాశనం ధ్యేయంగా ఐక్యత భావాలతో సంకల్పబద్ధంగా శక్తివంతమైన భారత దేశ పౌరులుగా ఎదగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగిస్తూ ఈ దినం దేశ స్వేచ్ఛతో ముడిపడిన విషాదకర విభజనను గుర్తు చేస్తుంది. మనం స్వాతంత్య్రం పొందినప్పుడు, లక్షలాది కుటుంబాలు భయానకమైన స్థానభ్రంశంతో ప్రియమైన వారిని కోల్పోయిన దుఃఖాన్ని ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన పూర్వీకులు విభజన గాయాలను భరించి ఆ విధ్వంసం నుండి ఐక్యత కలలు కన్నారు. ఆగస్టు 14 నాటి భయానక సంఘటనలను గుర్తు చేసుకోకుండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అసంపూర్ణంగా మిగిలిపోతాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. చరిత్ర నుండి నేర్చుకోకుండా, మనం ముందుకు సాగలేమన్నారు. విభజన సమయంలో ప్రజలు అనుభవించిన బాధకు చరిత్రలో సముచిత గుర్తింపు లభించలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్య వంశీ సూరజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు నిరంజన్ బిషి, ఏకామ్ర భువనేశ్వర్ నయోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, గవర్నర్ కార్యదర్శి, కమిషనర్ రూపా రోషన్ సాహు మరియు నిర్వాసిత పౌరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాసిత కుటుంబాలను సత్కరించారు.
కటక్ నగరానికి తీపి కబురు

ఐక్యత ముద్దు

ఐక్యత ముద్దు

ఐక్యత ముద్దు

ఐక్యత ముద్దు