
కటక్‌లో హర్ ఘర్ తిరంగా ఊరేగింపు
భువనేశ్వర్: కటక్ బొయాలీస్ మౌజా ప్రాంతంలో గురువారం నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ఊరేగింపులో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పాల్గొన్నారు. బొయాలీస్ మౌజా ప్రాంతంలో జింకిరియా వద్ద ప్రారంభమైన త్రివర్ణ పతాక ర్యాలీ చందులి వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడవునా కొనసాగింది. ఈ ఊరేగింపులో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజలు పాలుపంచుకున్నారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని బైక్‌లపై వందలాది మంది భారత్ మాతా కీ జై నినాదంతో ముఖ్యమంత్రితో కలిసి ఊరేగింపులో ఆద్యంతం పాల్గొన్నారు. అక్కడక్కడా మహిళలు ముఖ్యమంత్రిని పూలు, మంగళ హారతితో స్వాగతించారు. కటక్ ఎమ్మెల్యే ప్రకాష్ సెఠి, స్థానిక ప్రతినిధులు, వేలాది మంది ప్రజలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.