
గ్రానైట్ కంపెనీ మేనేజర్ కిడ్నాపర్ల అరెస్టు
పర్లాకిమిడి: గుసాని సమితి దుమ్మునిగ్రామం (దవిడిగాం) వద్ద శ్రీహరి గ్రానైట్స్ మేనేజర్ ధర్మేంద్ర కుమార్ తన కార్యాలయంలో బుధవారం పనిచేస్తుండగా తన ప్రత్యర్థి గోపాల్ సింగ్ రెండు కార్లతో ఏడుగురు గూండాలతో వచ్చి కత్తులతో బెదిరించి ధర్మేంద్ర కుమార్‌ను కిడ్నాప్ చేశారు. పది లక్షలు ఇస్తే విడిచిపెడతామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న దమ్మునిగాం జై శ్రీగ్రానైట్స్ మేనేజరు తారాసింగ్ యాదవ్ (రాజస్థాన్) స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్‌లో మధ్యాహ్నం 3 గంటల సమాయంలో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విజయనగరంలో ఉన్న గోపాల్ సింగ్ (గ్రానైట్స్ కంపెనీ యజమాని) నుంచి కిడ్నాప్‌కు గురైన ధర్మేంద్రను విడిపించారు. కిడ్నాప్‌కు గురైన ధర్మేంద్ర కుమార్ గోపాల్ సింగ్‌కు వ్యాపార లావాదేవీల్లో డబ్బు బాకీ ఉన్నట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరుల సమావేశంలో తెలిపారు. పలుసార్లు ధర్మేంద్ర కుమార్‌కు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేసినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కిడ్నాపర్స్ ఏడుగుర్ని ఒడిశా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.25వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు కార్లు (మహీంద్ర, మారుతీ డిజైర్) ను పోలీసులు స్వాధీనం చేసుకుని పర్లాకిమిడికి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన ఏడుగురు కిడ్నాపర్లను ఆదర్శ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేఽశంలో హాజరుపరిచారు. అనంతరం జిల్లా కోర్టుకు నిందితులను తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జ్యోతీంద్ర పండా విలేకరులతో అన్నారు. విలేకరుల సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అఽధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత్ భూపతి పాల్గోన్నారు.

గ్రానైట్ కంపెనీ మేనేజర్ కిడ్నాపర్ల అరెస్టు

గ్రానైట్ కంపెనీ మేనేజర్ కిడ్నాపర్ల అరెస్టు

గ్రానైట్ కంపెనీ మేనేజర్ కిడ్నాపర్ల అరెస్టు