
త్రివర్ణ పతాకాల రెపరెపలు
జయపురం: జయపురం పట్టణం గురువారం త్రివర్ణ పతాకాల రెపరెపలతో మెరిసిపోయింది. పట్టణంలో పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూడురంగుల జెండాలతో పట్టణంలో ప్రతి మార్గంలోనూ ర్యాలీలు నిర్వహించారు. ఉదయం 7 గంటల సమయంలో జయపురం మున్సిపాలిటీ అతి పెద్ద ర్యాలీ నిర్వహించింది. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అయిన సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సుజాత, బ్లాక్ విద్యాధికారి చందన నాయిక్, జయపురం సబ్‌డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి యశోద గదబ బాబు భాయ్ భజరంగ్, జయపురం సిటిజన్ కమిటీ అధ్యక్షురాలు బినోదినీ సాంతపాత్ర, కార్యదర్శి జి.వెంకట రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. విక్రమ్‌దేవ్ విశ్వ విద్యాలయ విద్యార్థులు కూడా ర్యాలీ చేశారు.

త్రివర్ణ పతాకాల రెపరెపలు