
లైంగికదాడులు, శిశు సురక్ష చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ద్వారా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మిశ్ర పర్యవేక్షణలో స్థానిక సరస్వతీ శిశు విద్యాలయం శారదా విహార్‌లో లైంగిక నేరాలు, శిశు సురక్షా చట్టం –2012పై చైతన్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత పాల్గొని మాట్లాడారు. పోస్కో చట్టం లింగభేదం లేకుండా శిశు సంక్షేమం, సురక్షణ కోసం తగిన వ్యవస్థను నెలకొల్పిందని వెల్లడించారు. శిబిరంలో స్పెషల్ పోస్కో కోర్టులో అవిభక్త కొరాపుట్ జిల్లా స్పెషల్ పీపీ డాక్టర్ బి.గాయిత్రీ దేవి, డిప్యూటీ లీగల్, లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్, పేనల్ న్యాయవాది పి.సన్యాసిరావు, సరస్వతీ శిశు విద్యాలయ సారదా విహార్ ప్రధాన ఆచార్య సత్యనారాయణ సెఠి, సరస్వతీ శిశు విద్యా మందిర్ శారద విహార్ విద్యార్థి న్యాయ సాక్షరత క్లబ్బు ఉపాధ్యాయులు రమేష్ చంద్రబెహర పాల్గొన్నార. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు న్యాయ సేవ ప్రదీకరణ కార్యదర్శిణి సుజాత ప్రశంసా పత్రాలు, ట్రోఫీలతో సత్కరించారు.

లైంగికదాడులు, శిశు సురక్ష చట్టాలపై అవగాహన

లైంగికదాడులు, శిశు సురక్ష చట్టాలపై అవగాహన

లైంగికదాడులు, శిశు సురక్ష చట్టాలపై అవగాహన