
మొక్కల పంపిణీ
జయపురం: జయపురం సమితి బలియ గ్రామం పంచాయితీలో గురువారం జయపురం శారదా విహార్ ప్రాంత వికాశ సంకల్ప ఫౌండేన్, కేశవ సేవా ట్రస్టులు సంయుక్తంగా వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా బలియ పంచాయతీ కుంతరకాల్ గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తుల్లో ఒక్కక్కరికీ రెండు మొక్కలు చొప్పున పంపిణీ చేసి వాటిని పెంచే బాధ్యతను తెలియజేశారు. మొక్కల పెంపకం జన జీవనానికి, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. వందలాది ఔషధ మొక్కలతో పాటు మునగ, బొప్పాయి, జామి, జీడి మామిడి మొక్కలను అందజేశారు. గ్రామీణులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు స్వీకరించారు. నిర్వాహకులు గ్రామీణులకు మొక్కలతో పాటు ఎరువులు అందజేశారు. ప్రతి గ్రామ వాసి కాయకూరలు, పండ్ల తోటలు పెంచి ప్రతి దినం ఆర్థికంగా లబ్ధి పొందాలని అందుకు తమ సంస్థలు సహకరిస్తాయని గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో కేశవ సేవా ట్రస్ట్, వికాశ సంకల్ప ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర, నిరాకర చౌదరి, డొంబురు పాణిగ్రహి, పార్ధసారధి, సుభ్రత పండ పాల్గొన్నారు.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ