
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: పోలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి తేల్‌రాయి పంచాయతీ సుధ్దాకొండ గ్రామంలో శుక్రవారం చోటచేసుకోగా భీమా సోడి (42) మృతి చెందాడు. సుద్దాకొండ గ్రామానికి చెందిద భీమా సోడి తన పొలంలో వ్యవసాయం పనులు చేయించేందుకు ఎంపీవీ–77 గ్రామానికి చెందిన వివేకవైద్య అనే యువకుడుని ట్రాక్టర్ డ్రైవర్‌గా పిలిచి పని చేయిస్తున్నారు. అయితే ట్రాక్టర్ టైరు మట్టిలో కూరుకుపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు వివేక్ స్పీడ్ రేజ్ చేశాడు. దానితో ట్రాక్టర్ బోల్తా పడి పక్కనే ఉన్న భీమాసోడిపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని రోదించారు. సమాచారం తెలుసుకున్న కలిమెల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఐసీ ముకుందో మేళ్క.. భీమా సోడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి