
కొటియాలో కలెక్టర్ పర్యటన
జయపురం: కొరాపుట్ జిల్లా నూతన కలెక్టర్ మనోజ్ సత్భాన్ మహాజన్ గురువారం కొటియ పంచాయతీ గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపైన, చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొటియా సర్పంచ్ నియ గమేల్, తుడా ప్రాజెక్ట్ డైరెక్టర్ బేణుధర శబర, కొరాపుట్ సబ్ కలెక్టర్ ప్రేమలాల్ హియాల్, బీడీఓ రామకృష్ణ నాయిక్, తహసీల్దార్ దేవేంద్ర దారువ, ఏఈ విశ్వనాథ్ మాదెలి, కొటియ పంచాయితీ ఇంజినీర్ జయరాం తొరాయి, ఏపీఓ సౌమేంధ్ర నాయిక్, కొటియ రూరల్ వాటర్ వర్క్స్ అండ్ శానిటేషన్ విభాగ అఽధికార ఇంజినీర్ బాసుదేవ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.