
బిసంకటక్ పోలీస్‌స్టేషన్ ఘెరావ్
రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి బిసంకటక్ పోలీసులు కేసు దర్యాప్తును నీరు గారుస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌ను ఘెరావ్ చేశారు. వందలాది ఆదివాసీ మహిళలు, యువకులు ఈ ఘెరావ్‌లో పాల్గొన్నారు. దీంతో రెండు గంటల సమయం పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. జిల్లాలొని బిసంకటక్ సమితి పరిధిలోని డుమురినాలొ పంచాయతీలొ గల లుటుగుడ గ్రామానికి చెందిన పింటు కిలక (21) అనే ఆదివాసీ యువకుడు జూన్ 27న సమితి పరిధిలో గల దుర్గిలో జరిగే రథయాత్రను చూసేందుకు వెళ్లాడు. యాత్రను చూసేందుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత దుర్గీ సమీపంలో గల ఒక అడవిలో యువకుని మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య చేసి ఎవరో ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తు బాధిత కుటుంబీకులు బిసంకటక్‌లొ ఫిర్యాదు చేశారు. కేసు నమోదై నెల రొజులు కావస్తున్నా పోలీసులు ఇంతవరకు హత్యకు సంబంధించిన వారిని పట్టుకోలేదని బాధిత కుటుంబీకులు ,గ్రామస్తులు ఆరొపిస్తు ఈ ఆందోళనకు దిగారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

బిసంకటక్ పోలీస్‌స్టేషన్ ఘెరావ్