
భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు
రాయగడ: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని స్థానిక కస్తూరీనగర్‌లోని సత్యనారాయణ ఆలయంలో కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పులఖండం రఘేనాయకుల శర్మ, కిశోర్‌శర్మ, వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన పూజలు జరగ్గా అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సుప్రభాత సేవ, అభిషేక కార్యక్రమాలు జరిగాయి.
కోదండ రామ మందిరంలో..
స్థానిక బ్రాహ్మణ వీధిలోని కోదండరామ మందిరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమ పూజలు జరిగాయి. పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఘనంగా శ్రావణశుక్ర వరలక్ష్మీ వ్రతాలు.
పర్లాకిమిడి: శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానక రాజవీధి పోడుగు కోవెలలో వరలక్ష్మీ పూజలను ప్రధాన అర్చకులు దుర్గాబాబు ఆధ్వర్యంలో ముత్తయిదవులతో చేయించారు. అలాగే పెట్రోల్ బంకు రోడ్డు, వాసవీ కన్య కాపరమేశ్వరీ ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలను అర్చకులు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో సామూహికంగా చేయించారు. కేవుటి వీధి ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వరలక్ష్మి వ్రతాలు ప్రధాన పూజారి ఎ.రాజగోపాలచారి ఆధ్వర్యంలో జరిగాయి.

భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు

భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు

భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు

భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు

భక్తి శ్రద్ధలతో శ్రావణ పూజలు