
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రమదానం
రాయగడ: జిల్లాలోని గుడారి గ్రామంలో ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయ పరిసరాలను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు శ్రమదానం ద్వారా శుక్రవారం శుభ్రం చేశారు. అలాగే కొత్త బస్టాండ్, తదితర ప్రాంతాల్లొ సఫాయి కార్యక్రమాలను చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఎస్.తిరుమల సింహాద్రి, కిరణ్ దొయ నంద, బి.తిరుమల, క్రిష్ణచంద్ర సాహు, దివ్యసింగ్ పాత్రో, బి.ఆదిత్య తదితరులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మంగు ఖీలో విస్తృత పర్యటన
మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి బొడ్డడోరాల్ పంచాయతీలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఈ పంచాయతీలోని పలువురు ఇళ్లు కోల్పోయారు. దీంతో వారిని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు ఇప్పిస్తామని తెలియజేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కై లాస్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కై లాస్‌పూర్ ఘాటి మలుపులో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు గురువారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ముకుందపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒమినీ వాహనంలో ఒక వ్యాపారి ముకుందపూర్ నుంచి జేకేపూర్ వైపు వస్తుండగా, ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక కారును అదుపుతప్పి ఢీకొంది. దీంతో కారు, ఒమినీ ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, అదేవిధంగా ఒమినీ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ప్రైవేట్ బస్సు యాజమాన్య సంఘం సభ్యులు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేటు బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడుతూ.. బస్టాండ్‌లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు నిర్ణయించామన్నా రు. చెట్లు ఉంటే అవి వివిధ రకాల పక్షులకు ఆవాసాలుగా ఉంటాయని పేర్కొన్నారు. బస్టాండ్ ప్రాంగణం అంతటా పరిశుభ్రం చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రమదానం

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రమదానం

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రమదానం