
ప్రైవేట్ బస్సు టికెట్ కౌంటర్ ఏర్పాటుపై వివాదం
జయపురం: జయపురం ప్రైవేట్ బస్సు టికెట్ కౌంటర్ ఏర్పాటుపై వివాదం తలెత్తింది. ప్రైవేటు బస్టాండ్ ఆవరణలో టికెట్ కౌంటర్ ఏర్పాటుపై కొందరు అభ్యంతరాలు తెలపడంతో వివాదం తలెత్తింది. ఈ సమస్యపై ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సలహాదారులు బుధవారం సంఘ కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడుతూ టిక్కెట్ కౌంటర్ వివాదం జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ముందు పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసమే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రైవేట్ బస్సు యాజమాన్య సంఘం అధ్యక్షుడు బాలా పాత్ర, న్యాయ సలహాదారు సుకాంత అధికారి,బస్సు యజమానులు పవిత్ర పాత్రో, బన త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.