
బీజేపీలోకి చేరికలు
మల్కన్‌గిరి: స్థానిక బీజేపీ కార్యాలయంలో మల్లవారం పంచాయతీకి చెందిన బీజేడీ కార్యకర్తలు బీజేపీలో గురువారం చేరారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి వీరికి పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో నారాయణ్ విశ్వాస్, శ్రీమాంత్ హల్ద్‌ర్, ముకా మడ్కామి, బిమా మాడ్కమి, కునా మిసీ్త్రలు ఉన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు.
‘తప్పుడు వార్తలు రాస్తున్నారు’
జయపురం: మీడియా ప్రతినిధులు తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని బొరిగుమ్మ అటవీ విభాగ మహిళా ఫారెస్టర్ రంజిత కుమారి నాయక్ ఆరోపించారు. స్థానిక ఒక హొటల్‌లో ఆమె మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు రాసిన వార్తపై రేంజర్ దర్యాప్తు జరిపారని, ఆ సమయంలో గ్రామ ప్రజలు వార్డు మెంబర్, సర్పంచ్ నాయిక సర్పంచ్ అభిప్రాయాలను సేకరించారని తెలిపారు. కలప దొంగతనం జరిగిందని చూపిస్తున్న వీడియో దాదాపు ఆరేళ్ల కిందటిదని తెలిపారు. జర్నలిస్టులు బిజయ పంగి, ఇంధ్ర పంగిలు ఈ వీడియోతో తనను బ్లాక్ మెయిల్‌చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ ఇద్దరు జర్నలిస్టులు తనను మానసిక వేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఆకార్‌పల్లిలో
అధికారుల పర్యటన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఆకార్‌పల్లి పంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా పాడైంది. సుమారు 120 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పలు పత్రికల్లో వార్తలు రావడంతో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి గురువారం స్పందించారు. కలిమెల సమితి అధికారి తపాన్ కుమార్ సేనాపతితో చర్చించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీడీఓ, పీఈఓ కలిసి ఆకార్‌పల్లి పంచాయతీలో పర్యటించారు. అక్కడి సమస్యలపై సర్పంచ్ సత్యసరణ్ పాల్‌తో చర్చించారు. గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి రూ.6 లక్షల నిధులు మంజూరు చేశారు. తొలుత రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే నర్సింగ్ ఆదేశించారు.

బీజేపీలోకి చేరికలు

బీజేపీలోకి చేరికలు