
గ్రామతరంగ్ తొలిదశలో 180 మందికి శిక్షణ
పర్లాకిమిడి: జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన శాఖ, సెంచూరియన్ వర్సిటీ అనుబంధ సంస్థ గ్రామతరంగ్ శిక్షణ నిమిత్తం గురువారం కలెక్టరేట్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు గ్రామ్‌తరంగ్ రాష్ట్ర ముఖ్యులు రంజన్ త్రిపాఠి, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి ల మధ్య ఒప్పందం సంతకాలు చేశారు. రాష్ట్రంలో తొలి దశలో 180 మంది టెన్త్, ఐటీఐ, ప్లస్ 2 విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, హ్యాండ్ హెల్డ్ డివైస్ ట్రేడ్‌లో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని జిల్లా ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్ మెంట్ అధికారి సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు శిక్షణ కోసం 9827946884 నంబరుకు సంప్రదించగలరని త్రిపాఠి తెలియజేశారు.