
అభివృద్ధి పథకాల అమలుపై ఆరా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్, జిల్లా నోడల్ అధికారి బిజయ్ కేతన్ ఉపాధ్యాయ క్షేత్ర పరిశీలన చేశారు. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ప్రతి ఏడాది జరిగే మండయ్ ఉత్సవాల గ్రౌండ్‌ను పరిశీలించారు. ఆ ప్రాంతంలో శాశ్వతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. శాసన, అగ్నిపూర్ గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. మహుల్ పొదర్, సన్న మసిగాం జీడి పరిశ్రమ కేంద్రాల్లో పర్యటించారు. సన్న మసిగాం గ్రామంలో 20 మంది మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా ఉపాధి పొందుతున్న చేనేత పరిశ్రమలో మహిళలతో మాట్లాడారు. తంగజారి, బాసిని గ్రామాల్లో ప్రభుత్వ సహాయంతో గిరిజనులు పండిస్తున్న స్ట్రా బెర్రీ ఉత్పత్తులను పరిశీలించారు. లిమబట్ట, కొకొడి సెమ్లా గ్రామాల్లో హస్త కళల ఉత్పత్తి కేంద్ర కళాకారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయంపై ఆరా తీశారు. మిషన్ శక్తి వ్యవహారాలు, మెగా వాటర్ ప్లాంట్ నిర్మాణాలను జిల్లా వ్యాప్తంగా పరిశీలించారు. ఈ పర్యటనలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, అన్ని శాఖలు అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పథకాల అమలుపై ఆరా

అభివృద్ధి పథకాల అమలుపై ఆరా

అభివృద్ధి పథకాల అమలుపై ఆరా