మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి ఉదులిబేఢ పంచాయతీ పేడాగూఢ గ్రామ అటవీ భూమి హక్కుల కమిటీ తరఫున అటవీ ఉత్పత్తుల విక్రయాలకు అనుమతులు కోరుతూ మంగళవారం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అటవీ భూమి హక్కుల కమిటీ అధ్యక్షుడు సమర నాయక్, కార్యదర్శి భక్తరామ్ పూజారి నేతృత్వంలో కమిటీ సభ్యులు కలెక్టర్‌తో చర్చించారు.
చలివేంద్రం ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి ఒడిశా–ఛత్తీష్‌గడ్ సరిహద్దు కుమార్‌గూడ గ్రామం వద్ద పోడియ పోలీసులు చలివేంద్రం సోమవారం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు. అందువలన ప్రజాప్రయోజనార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ తెలిపారు.
ఆస్పత్రిలో పనిచేయని ఎక్స్‌రే మిషన్!
జయపురం: జయపురం ఫూల్‌బెడ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్ పనిచేయటంలేదు. దీంతో ఎక్స్‌రే యూనిట్ గదికి సిబ్బంది తాళాలు వేసేశారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఉచింతంగానే ఎక్స్‌రే తీసేవారు. అయితే ప్రస్తుతం పని చేయక పోవటంతో రోగులు ప్రైవేటుగా డబ్బులు చెల్లించి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపురం పట్టణానికి వెళ్లి ఎక్స్‌రే తీయించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎక్స్‌రే యూనిట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
జయపురం యువతికి
నారీరత్న పురస్కారం
జయపురం: జయపురం యువతి, ప్రస్తుతం ఢిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తున్న ప్రభాతీ నాయక్ మిశ్రాకు నారీ రత్న పురస్కారం లభించింది. ప్రపంచ ఒడిశా సొసైటీ వారు న్యూఢిల్లీలో నిర్వహించిన శక్తి ఉత్సవంలో న్యాయవాది ప్రభాతీ నాయిక్‌ను ఘనంగా సత్కరించారు. ప్రభాతీ పాతికేళ్లుగా పాత్రికేయ రంగంలో ఉంటూ సాధారణ ప్రజల గొంతుగా వారి సమస్యలపై పోరాడారు. కొన్నేళ్లుగా న్యాయవాదిగానూ పనిచేస్తున్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రభాతి గృహిణిగా కుటుంబంపై తన బాధ్యతలను నిర్వహిస్తూ న్యాయవాదిగానూ రాణిస్తున్నారు. దీంతో ఆమెను ప్రపంచ ఒడియా సొసైటీ వారు నారీరత్న బిరుదుతో సన్మానించారు. ప్రభాతి జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ నివాసీ కై లాస చంద్ర నాయిక్ కుమార్తె. ఆమె మున్సిపాలిటీ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో, మహిళా కళాశాలలో, విక్రమదేవ్ కళాశాలలో చదివారు.
అటవీ ఉత్పత్తుల విక్రయానికి విజ్ఞప్తి
అటవీ ఉత్పత్తుల విక్రయానికి విజ్ఞప్తి