
పంచాయతీ కార్యాలయం ఘెరావ్
రాయగడ: జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ పంచాయతీ కార్యాలయాన్ని కన్హుగుడ గ్రామస్తులు ఘెరావ్ చేశారు. గత కొద్ది నెలలుగా పీడీఎస్ బియ్యంతో పాటు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాగులను ఇవ్వకపోవడంతో వాటిని ఇచ్చేంత వరకు కార్యాలయం మూసివేయాలని ఆందోళన చేపట్డారు. సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ సమితి ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ దాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు అధికారి ఎస్.భొయ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. రాగుల కొరత కారణంగా పీడీఎస్ బియ్యంతో పాటు వాటిని సరఫరా చేయలేకపోతున్నామని, త్వరలో ఎవరెవ్వరికి ఇవ్వలేదో వారిని గుర్తించి రాగులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన ఆదివాసీ మహిళలు పంచాయతీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు. ఈ పంచాయతీ పరిధిలో 2070 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2024 సెప్టెంబరు నెల నుంచి ప్రతి రేషన్ కార్డు దారునికి 35 కిలోల చొప్పున్న 1810 మందికి 633 క్వింటాళ్ల రాగులను పంపిణీ చేయడం జరిగిందని భొయ్ తెలియజేశారు. అయితే మిగతా 260 మంది లబ్ధిదారులకు కొద్ది నెలలుగా రాగులు పంపిణీ జరగలేదని త్వరలో వారికి కూడా రాగులు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment