అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో అదరగొట్టిన ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో అదరగొట్టిన ప్రసాద్‌

Feb 9 2025 12:37 AM | Updated on Feb 9 2025 12:37 AM

అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో అదరగొట్టిన ప్రసాద్‌

అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో అదరగొట్టిన ప్రసాద్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టార్‌ క్రికెటర్‌ సింగుపురం దుర్గ నాగ వరప్రసాద్‌ మరోసారి అదరగొట్టే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న కల్నల్‌ సీకేనాయుడు అండర్‌–23 అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 బంతుల్లో 9 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 107 పరుగుల అజేయ సెంచరీతో రాణించి ఆంధ్రా జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. ప్రస్తుతం ఆంధ్రా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఏసీఏ తన అధికారిక ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియాలో అభినందిస్తూ పోస్ట్‌చేసింది. ప్రసాద్‌ రాణింపు పట్ల జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు పీవైఎన్‌ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్‌, మెంటార్‌ ఇలియాస్‌ మహ్మద్‌, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్‌ ఎస్‌.రవికుమార్‌, ఆర్సీ రెడ్డి, సీనియర్‌ క్రికెటర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదే లెక్కన రాణిస్తే 2026 ఐపీఎల్‌తోపాటు రంజీలు, జాతీయ జట్టు సెలక్షన్‌ ట్రయల్స్‌కు ఎంపిక కావడం ఖాయమని జిల్లా క్రికెట్‌ సంఘ పెద్దలు భావిస్తున్నారు.

జులమూరు కుర్రాడే..

జలుమూరులోని పోలీస్‌స్టేషన్‌ వీధిలో నివాసం ఉండే ఎస్‌డీఎన్‌వి ప్రసాద్‌ తండ్రి సింగుపురం ఉపేంద్ర కారు డ్రైవర్‌గా పనిచేస్తూ 2019లో అనారోగ్యంతో మరణించగా.. తల్లి సింగుపురం రేవతి జలుమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్‌ టెక్కలిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఎంపికకావడమే తన క్ష్యమని.. అందులో రాణించి జాతీయ జట్టుకు ఎంపికకావడమే జీవితాశయమని ప్రసాద్‌ చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement