రాయగడలోని సంస్కృతి మహిళా అనుష్టాన్ ఆధ్వర్యంలో ఆదివారం బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో రొజ్జొ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక మాట్లాడుతూ ఒడియా మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే రొజ్జొ ఉత్సవాలు సమైక్యతకు అద్దంపడతాయని చెప్పారు. అనుష్టాన్ అధ్యక్షురాలు సుజాత పాలొ మాట్లాడుతూ ఏటా తమ సంస్థ ద్వారా మహిళలను ఉత్సాహపరిచేందుకు రొజ్జొ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మెహందీ, ముగ్గుల పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంసృతిక ప్రదర్శనలు అలరించాయి. – రాయగడ