
బలి జాతరకు ఇసుక సంగ్రహణ
జయపురం: ఖరీప్ సీజన్ సమయంలో కొరాపుట్ ఆదివాసీ ప్రజలు జరుపుకునే వ్యవసాయ సంబంధిత బలిజాతర పండగ ఒకటి. ఈ జాతర జరపడం వలన పంటలు బాగా పండుతాయని, తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి ప్రజ ల నమ్మకం. అటువంటి బలి జాతరకు బొరిగుమ్మ సమితి శొశాహండి పంచాయతీ ప్రజలు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ మహిళలంతా బుట్టలతో నువాగుడ గ్రామ సమీపంలోని చిరుశ్రోత నదికి వెళ్లి ఇసుక నింపుకొని, వాటిలో వివిధ రకాల విత్తనాలు చల్లి తమ గ్రామంలో ఉన్న దేవత గుడిలో ఉంచారు. గ్రామ సాంప్రదాయం ప్రకారం ఈనెల 28వ తేదీన బలి జాతర మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. బుట్టల్లో వేసిన విత్తనాల్లో మొలకెత్తిన విత్తనాలను ఖరీఫ్ సీజన్‌లో పండిస్తే మంచి దిగుబడి వస్తుందని ప్రజల నమ్మకం.