సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో | Lions surprised the visitors in Zoo at Nandan Kanan | Sakshi
Sakshi News home page

సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో

Jul 10 2023 1:00 AM | Updated on Jul 10 2023 6:06 PM

Lions surprised the visitors in Zoo at Nandan Kanan - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే..

విచిత్రమైన అనుభవం

వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్‌ నందనకానన్‌ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్‌ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది.

వచ్చేశాయి సింహాలు

ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్‌ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్‌వోకు ఆదేశించినట్లు నందన కానన్‌ డైరెక్టరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement