టాయిలెట్లకు దాతలు కావాలంట! | - | Sakshi
Sakshi News home page

టాయిలెట్లకు దాతలు కావాలంట!

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

టాయిలెట్లకు దాతలు కావాలంట!

టాయిలెట్స్‌ కట్టలేనోళ్లు.. నగరాన్ని అభివృద్ధి చేస్తారా! షాదీఖానా నిర్మాణం ఏడాది క్రితమే పూర్తి వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.2 కోట్ల నిధులు మంజూరు నిధుల్లేవు.. డోనర్లను చూడమంటూ ఎమ్మెల్యే ఉచిత సలహా! భగ్గుమంటున్న ముస్లింలు

కూటమి ప్రభుత్వం వదిలేసింది

లబ్బీపేట(విజయవాడతూర్పు): టాయిలెట్లు లేకపోవడంతో షాదీఖానా ఏడాదిగా ప్రారంభోత్సవానికి దూరంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల కోసం లబ్బీపేటలో రూ.2 కోట్లతో షాదీఖానా భవన నిర్మాణం చేస్తే, ఏడాది దాటినా టాయిలెట్లు లేవంటూ ప్రారంభోత్సవం నిలిపివేయడంపై ముస్లింలు మండిపడుతున్నారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తూర్పు ఎమ్మెల్యే.. టాయిలెట్ల నిర్మాణానికి నిధులు లేవు... దాతలను చూడండి అని చెప్పడంపై మండిపడుతున్నారు. కనీసం టాయిలెట్ల నిర్మాణం చేయలేని వాళ్లు ఇప్పుడు ఎన్నికల్లో నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్బాలు పలకడంపై ముస్లింలు మండిపడుతున్నారు.

నిర్మాణం పూర్తై ఏడాది..

లబ్బీపేట బందరు కాల్వ ఒడ్డున రెండు అంతస్తుల్లో షాదీఖానా నిర్మాణం ఏడాది క్రితమే పూర్తైంది. దానికి విద్యుత్‌ సరఫరాతో పాటు, టాయిలెట్స్‌ నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేస్తే ముస్లింలు చిన్న ఫంక్షన్‌లు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఏడాదిగా ఎలాంటి పనులు చేపట్టకుండా ఆ భవనాన్ని అలాగే వదిలేశారు. అదేమంటే.. వైఎస్సార్‌ సీపీ చేపట్టిన నిర్మాణం కావడమే కారణమంటున్నారు. గతంలో సైతం ఇదే ఎమ్మెల్యే స్థలం కేటాయింపు విషయమై ప్రచారం చేసుకున్నారే కానీ కేటాయించలేదు. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని ముస్లింలు మండిపడుతున్నారు.

చిత్తశుద్ధితో నిర్మించిన వైఎస్సార్‌ సీపీ..

రాష్ట్రంలో 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్బీపేటలో షాదీఖానా విషయాన్ని స్థానిక ముస్లింలు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి షాదీఖానాకు ఆర్‌ అండ్‌ బీ నుంచి స్థలం కేటాయింపుతో పాటు, నిధులను సైతం మంజూరు చేయించారు. నాటి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాతో శంకుస్థాపన చేయించి, ఎన్నికల నాటికే దాదాపు 60 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం మిగిలిన పనులు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం దాన్ని ప్రారంభోత్సవం జరపకుండా నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పేద, మధ్యతరగతి ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లు కేటాయించారు. భవన నిర్మాణం పూర్తైంది. ఇప్పుడు టాయిలెట్స్‌ నిర్మాణం చేపడితే ముస్లింలు వినియోగించుకోవచ్చు. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు మంచి చేయడం ఇష్టం లేక దానిని అలాగే వదిలేసింది. ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వచ్చి దాతలు ఉంటే చూడాలని చెప్పడం సిగ్గుచేటు. టాయిలెట్స్‌ కట్టని వారు నగరాన్ని ఏం అభివృద్ధి చేస్తారు.

–ఎండీ నాహీద్‌, మైనార్టీ నేత, లబ్బీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement