ఆలోచించండి.. ఆశీర్వదించండి | - | Sakshi
Sakshi News home page

ఆలోచించండి.. ఆశీర్వదించండి

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

ఆలోచించండి.. ఆశీర్వదించండి

వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాలనకు తేడా గమనించండి మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా 99శాతం అమలు చేశాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్‌ సీపీ పాలనకు, కూటమి పాలనకు తేడా గమనించాలి. అవినీతి పోయి అభివృద్ధి జరగాలంటే తమను గెలిపించాలి’ అంటూ మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మేయర్‌, చైర్‌ పర్సన్‌ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాలనకు తేడా వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్‌తోపాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మునిసిపాలిటీల్లో ప్రచారం సాగుతోంది.

● వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి నగరంలోని తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, సెంట్రల్‌లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. తూర్పులో 12, 22, 23 డివిజన్లలోనూ, సెంట్రల్‌లో 65, 77,79 డివిజన్లలో ప్రచారం చేసి గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

● అవినీతి పోయి అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని వైఎస్సార్‌ సీపీ మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి షేక్‌ హఫీజున్నీసా ఓటర్లను కోరారు. జగ్గయ్యపేటలోని 22వ వార్డులో తన్నీరు నాగేశ్వరరావు సతీమణి సుధారాణితో కలిసి హఫీజున్సీసా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 22వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి చెరుకుపల్లి రాంబాబు పాల్గొన్నారు.

● కొండపల్లి మునిసిపాలిటీలోని 17, 18, 19, 20, 21, 32, 33, 34 వార్డుల్లో చైర్‌ పర్సన్‌ అభ్యర్థి నల్లమోతు తేజస్వి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జోగి రాజీవ్‌ పాల్గొని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. నాయకులు మేడపాటి నాగిరెడ్డి, నల్లమోతు ప్రకాష్‌, లంకె అంకమోహనరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement