ఢిల్లీ : ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్‌లకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో అక్రమలు, హింస, నామినేషన్ అడ్డగింతలపై లేఖ ద్వారా వివరించారు.
‘అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులకు దిగారు. పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి.. వాహనాలు ధ్వంసం, నిప్పంటించడం వంటివి జరిగాయి. 222 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
కడపలో 66 వార్డులకు 11, మైదుకూరులో 32కు 4, రాజంపేటలో 32కు 7 నామినేషన్లు మాత్రమే పడ్డాయి. 1,345 మంది అభ్యర్థులు నామినేషన్ సమయంలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. పోలీసుల పక్షపాతం, ఎన్నికల సంఘం వైఖరిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలి. కేంద్ర బలగాలు, విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణతో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగాలి’ అని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కూటమి కుట్రలు.. నకిలీ నామినేషన్లు..!


