ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రికి భవానీలు, భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటలకే ఆలయానికి చేరుకున్న భవానీలు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ప్రధాన ఆలయంలో అమ్మవారికి ఖడ్గమాలార్చన ప్రారంభం కాగా, అప్పటికే క్యూలైన్‌లో వేచి ఉన్న అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లు దాటుకుని ఆలయానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై సర్వదర్శనం రెండు క్యూలలో దర్శనానికి అనుమతించారు.
తెలంగాణ నుంచి భారీగా భక్తులు
తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఒడిబియ్యంతో పాటు పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భవానీలు ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, ఉపాలయమైన నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల వద్ద అర్చకుల చేతుల మీదగా దీక్ష విరమణ చేశారు.
అన్నదానం కోసం క్యూ
దీక్షలు విరమించిన భవానీలు, భక్తులు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేందుకు అన్నదాన భవనం వద్ద క్యూ కట్టారు. ఉదయం 10గంటలకే అన్న ప్రసాద వితరణ ప్రారంభించి, నాలుగు గంటల వరకు కొనసాగించారు.
మణిపాల్‌లో లైవ్ ఆపరేటివ్ వర్క్‌షాప్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్‌లో ఆదివారం టెప్(టోటల్లీ ఎక్స్‌ట్రాపెరిటోనియల్) లైవ్ ఆపరేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ విభాగాల డైరెక్టర్ డాక్టర్ గణేష్ షెనాయ్ మార్గదర్శకత్వంలో వర్క్‌షాప్ చేపట్టారు. డాక్టర్ గణేష్ షెనాయ్ మాట్లాడుతూ హెర్నియా చికిత్సలో మినిమల్లీ ఇన్వేసిస్ సర్జరీ విధానాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. టీఈపీ, ఈటీఈపీ వంటి పద్ధతులు హెర్నియా చిక్సిత అందించడంలో సర్జన్లకు వివిధ మార్గాలను అందిస్తున్నారని వివరించారు. హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ హెర్నియా చికిత్సలో ఉపయోగించే ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని రోగుల చికిత్సలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకునే అవకాశాన్ని సర్జర్లను కల్పించామని తెలిపారు. ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు, ఆచరణాత్మక శిక్షణ వలన మినిమల్లీ ఇన్వేసివ్ విధానాల్లో వివిధ దశలను సర్జన్లు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డి.రవి(జనరల్ సర్జరీ), డాక్టర్ డి.వరుణ్(సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) పాల్గొన్నారు.


