మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నవంబర్ 14వ తేదీ వైజాగ్, కాకినాడల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్మిమ్మింగ్ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు పలు విభాగాల జట్లలోని సభ్యుల ఎంపికలు నగరంలోని గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్లో ఆదివారం జరిగాయి. వివిధ విభాగాల్లో ఎంపికై న జట్లలోని స్విమ్మర్లను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రవికాంత్, సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఇన్చార్జ్ అనిల్, కోచ్లు ఎం.మాల్యాద్రి, లక్ష్మణ్, రఫీ, గౌతమ్ అభినందించారు.
ఎంపికై న స్విమ్మర్లు వీరే
గ్రూప్1బి విభాగంలో.. పి.రమ్య శ్రీ, ఎన్.ధ్రుతిరామస్వామి, ఎస్.శ్యామంత్, ఎస్.లక్ష్మి వరుణ్, సి.విష్ణువర్థన్, ఎండీ ముజాఖిర్,వై. రిత్విక్సాయివిఘ్నేష్, బి.పృధ్వీరాజ్, బి.జయప్రకాష్ ఎంపికయ్యారని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐ.రమేష్ తెలిపారు.


