జాతీయ స్థాయి బ్యాండీ పోటీలో కానూరు విద్యార్థినికి పతకం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బ్యాండీ పోటీలో కానూరు విద్యార్థినికి పతకం

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

అమరావతి సందర్శించిన సింగపూర్‌ పాత్రికేయ బృందం

పెనమలూరు: కానూరు స్కాట్‌స్సైస్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో బ్యాండీ(ఐస్‌ హాకీ)పోటీలో పతకం సాధించింది. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ చలసాని ప్రతిమ శనివారం వివరాలు వెల్లడించారు. 8వ జాతీయ బ్యాండీ–2026 పోటీలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహరాడూన్‌లో ఇటీవల నిర్వహించారని, తమ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని అబ్దుల్‌ అఫ్షిన్‌ అండర్‌ 10 విభాగంలో కాంస్య పతకం గెలిచిందన్నారు. ఈ సందర్భంగా అఫ్షిన్‌ను, కోచ్‌ ఎండీ ఖాజాను పాఠశాల చైర్మన్‌ వీరమాచినేని వంశీకృష్ణ, డైరెక్టర్‌ శాంతి, సీఈవో కొడాలి జాహ్నవి అభినందించారు.

రేపు ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని 26వ తేదీ సోమవారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరగనుందని దుర్గగుడి ఈఓ శీనా నాయక్‌ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులు కొలువు తీరుతారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం వాహనంతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగుతుంది. గిరి ప్రదక్షిణలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులతో పాటు భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది విరివిగా పాల్గొనాలని దేవస్థాన వైదిక కమిటీ పిలుపునిచ్చింది.

అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరా వతిలోని అపురూపమైన బౌద్ధ వారసత్వ సంపదను సింగపూర్‌ పాత్రికేయ బృందం శనివారం సందర్శించింది. స్థానిక పురావస్తు మ్యూజియం, అమరావతి మహాస్తూపం, ధ్యానబుద్ధ విగ్రహాన్ని బృందం సందర్శించింది. సింగపూర్‌ పాత్రికేయ బృంద సభ్యులు భవన్‌ జైప్రగాస్‌, డారిల్‌ లిమ్‌, కీర్తిగా రవీందరన్‌, మహమ్మద్‌ ఇజ్వాండి బిన్‌ అజ్మాన్‌, శివరంజని గుణశేఖరన్‌లకు పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు స్వాగతం పలికారు. స్థానిక అధికారులు అమరావతి బౌద్ధ వారసత్వ ప్రాముఖ్యత ను, బౌద్ధధర్మం మానవ జీవనవిధానంపై చూపిన ప్రభావాన్ని అమరావతికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశిష్టతను బృంద సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రాధికార సంస్థ ఆర్‌డీ ఈడి ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక శాఖాధికారి నాయుడమ్మ, పురావస్తు శాఖాధికారి నాగేంద్రకుమార్‌ పర్యాటక శాఖ యూనిట్‌ మేనేజర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రైన్‌లో గుర్తు తెలియని

మృతదేహం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): పాముల కాల్వ నుంచి వైవీ రావు రింగ్‌ వైపు ఉన్న డ్రైన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం గుర్తించారు. ఘటనపై వీఆర్వో మర్రెపూడి శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైవీ రావు రింగ్‌ సమీపంలోని చిన్న వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో గుర్రపు డెక్క కింద తలకిందులుగా సుమారు 45 నుంచి 50 ఏళ్ల పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండటంతో స్థానికులెవరూ సదరు వ్యక్తిని గుర్తు పట్టలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement