రోల్‌ ప్లే, ఫోక్‌ డ్యాన్స్‌ పోటీల్లో అంగలూరు, కొండూరులకు ప్రథమస్థానం | - | Sakshi
Sakshi News home page

రోల్‌ ప్లే, ఫోక్‌ డ్యాన్స్‌ పోటీల్లో అంగలూరు, కొండూరులకు ప్రథమస్థానం

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ఉమ్మడి జిల్లా స్థాయి రోల్‌ ప్లే, ఫోక్‌ డ్యాన్స్‌ పోటీలు నిర్వహించారు. కృష్ణాజిల్లా పరిధిలో ఫోక్‌ డ్యాన్స్‌లో అంగలూరు గవర్నమెంటు హైస్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానం పొందారని ప్రిన్సిపాల్‌ మోహినీకుమారి తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఫోక్‌ డ్యాన్స్‌, రోల్‌ ప్లే పోటీలలో కొండూరు కేజీబీవీఏ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం పొందారని చెప్పారు. విజేతలు నవంబర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. కార్యక్రమానికి నోడల్‌ ఆఫీసర్లుగా రామ ప్రసాద్‌, శ్రీనివాస్‌, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా స్థాయిలో

కొండూరు విద్యార్థులకు ప్రథమ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement