అక్రమ మద్యం రవాణాపై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం రవాణాపై నిరంతర నిఘా

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదేశం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్ర ఎకై ్సజ్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల ఎకై ్సజ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరెన్సీనగర్‌లోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఏపీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ, హెడ్‌ క్వార్టర్స్‌ డెప్యూటీ కమిషనర్‌ వివేక్‌, విజయవాడ డెప్యూటీ కమిషనర్‌ టి.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ లావణ్య, ఎన్టీఆర్‌, కృష్ణా ఎకై ్సజ్‌ అధికారి ఎన్‌. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎకై ్సజ్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ గొల్లపూడిలోని శ్రీ సాయికృష్ణ వైన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసి, దుకాణంలో మద్యం స్టాక్‌, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement