కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి చోరీలు నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి చోరీలు నిందితుడి అరెస్ట్‌

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ప్రయాణించే వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు కలిపిన కూల్‌ డ్రింక్స్‌ ఇచ్చి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న వ్యక్తిని ప్రకాష్‌నగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ నెల 8న రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్‌లో రావులపాలేనికి చెందిన గీసాల మహాలక్ష్మి అనే వృద్ధురాలి మూడు కాసుల బంగారు చైన్‌ చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన సమయమంతుల వెంకటేశ్వరరావును శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి బంగారు చైన్‌, మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒంటరిగా ప్రయాణించే 60 నుంచి 70 ఏళ్ల వయసున్న మహిళలతో పరిచయం పెంచుకుని, వారికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి, కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు ఆభరణాలను దొంగిలించేవాడని అన్నారు. నిందితుడిపై గతంలో విజయవాడ కృష్ణలంక, జంగారెడ్డిగూడెం, తొర్రూరు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement