పేదల నీళ్లు... పెద్దల పొలాల్లోకి..! | - | Sakshi
Sakshi News home page

పేదల నీళ్లు... పెద్దల పొలాల్లోకి..!

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

పేదల నీళ్లు... పెద్దల పొలాల్లోకి..!

కొండ ప్రాంతాల నీళ్లు గద్దే వారి పొలాల్లో నివాసాలకు... అడ్డుకునేందుకు దేవినేని అవినాష్‌ పోరాటం అయినా అధికారం అడ్డుపెట్టుకుని పైప్‌లైన్‌ వేసిన వైనం తత్ఫలితంగా కొండ ప్రాంతాల్లో పెరిగిన నీటి సమస్య

కొండ పై ప్రాంతాలకు నీటి కొరత

లబ్బీపేట(విజయవాడతూర్పు): కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల దాహార్తిని తీర్చే నిమిత్తం వేసిన మంచినీటి పైప్‌లైన్‌ను పాలకులు పక్కదారి పట్టించారు. గద్దెనెక్కిన వారి పొలాల్లోని నివాసాలకు తాగునీరు అందించడానికి మళ్లించారు. తత్ఫలితంగా గుణదల, మాచవరం కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాగునీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా మళ్లించే క్రమంలోనే దేవినేని అవినాష్‌ నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ నేతలు చినబాబు, చందా కిరణ్‌తేజ తదితరులు ఆందోళనకు దిగి పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. పనులు నిలిపివేయాలంటూ నీటి గుంటలో నిల్చుని నిరసన తెలిపారు. అయినా అధికార దురహంకారంతో పోలీసులను అడ్డు పెట్టుకుని పైప్‌లైన్‌ను గద్దే వారి పొలాల్లోకి మళ్లించేసి యథేచ్ఛగా నీటిని తరలించేస్తున్నారు.

కొండ ప్రాంతాల్లో పెరిగిన నీటి సమస్య

కార్మికనగర్‌, దేవినేని నగర్‌ కొండ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలోని రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వేశారు. కొండ పై భాగంలో రిజర్వాయర్‌ ఉండటంతో కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు చిట్టచివరి ఇళ్ల వరకూ నీరు చేరేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ ప్రాంతాలకు చెందిన రిజర్వాయర్‌ నుంచి నీటిని 1వ డివిజన్‌, గద్దే వారి పొలాల్లోకి మళ్లించేందుకు నిర్ణయించి పైప్‌లైన్‌ను అటువైపు కనెక్ట్‌ చేశారు. దీంతో రిజర్వాయర్‌ కెపాసిటీ సరిపోక కార్మికనగర్‌, దేవినేని నగర్‌, మాచవరం కొండ ప్రాంతాల్లో నీటి సమస్య నెలకొంది.

గతంలో కొండ ప్రాంతాల్లో చిట్టచివరి వరకూ నీరు సరఫరా అయ్యేది. ఇప్పుడు పైప్‌లైన్‌ను వేరే ప్రాంతాలకు కనెక్ట్‌ చేయడంతో నీటి ఫోర్స్‌ తగ్గింది. దీంతో కొండ చిట్టచివరి ప్రాంతాల వారికి నీరు సరిగా సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికనగర్‌, దేవినేని నగర్‌ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొండ ప్రాంతాలకు సమస్య ఉంటుందని నాడు చెప్పినా వినకుండా అధికారం అడ్డుపెట్టుకుని నీరు మళ్లించేశారు. – ఎండీ మొయిన్‌, మాచవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement