ఇంద్రకీలాద్రిపై గత 10 రోజులుగా జరిగిన దసరా మహోత్సవాలలో మొత్తం 15.05 లక్షల మంది విచ్చేశారని ఆలయ అధికారులు ప్రకటించారు. మూలా నక్షత్రం రోజున 2.32 లక్షల మంది అమ్మవారి దర్శనానికి విచ్చేశారని పేర్కొన్నారు. ఇక ఉత్సవాలలో తొలి రోజున 1.47లక్షలు, రెండో రోజున 1.50లక్షలు, మూడో రోజున 1.44లక్షలు, నాల్గో రోజున 1.17లక్షలు, ఐదో రోజున 1.27లక్షలు, ఆరో రోజున 2.32లక్షలు, 7వ రోజున 1.32లక్షలు, 8వ రోజున 1.54లక్షలు, 9వ రోజున 1.47లక్షలు, 10వ రోజున 1.51 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.


