మహా పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

మహా పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

మహా పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు

ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం సమీపంలోని నూతన యాగశాలలో మంగళవారం మహా పూర్ణా హుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఫెఫ్టివల్‌ ఆఫీసర్‌ త్రినాథరావు, చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ పాల్గొన్నారు. మంగళవారం, బుధవారం రాత్రి 12 గంటల వర కు భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీల రాకతో ఆలయ ప్రాంగణం, కనకదుర్గనగర్‌, మహామండపం దిగువన ఇరుముడి పాయింట్లు, అన్న ప్రసాద భవనం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి.

శుక్రవారం వరకు ఏర్పాట్లు యథాతథం..

దసరా ఉత్సవాలు ముగిసినా భవానీలు, భక్తుల రాకతో శుక్రవారం వరకు ఉత్సవ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ సాధారణం అయ్యే వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కూడా అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమివ్వగా భవానీలు, భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారు జామున 1.30 గంటలకు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించిన అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. వీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న కంపార్టుమెంట్లు, క్యూలైన్ల ఉన్న భవానీలు, భక్తులు కొండపైకి చేరుకునేందుకు 5 గంటలకు పైగా సమయం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement