కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

జగ్గయ్యపేట: కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని కోటిలింగాల వద్ద బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జంగాల కేశవ గోపాలరావు (17) పట్టణంలో ఒక ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం కాసారం గ్రామానికి చెందిన స్నేహితుడు రామ్‌చరణ్‌ బైక్‌పై జగ్గయ్యపేటకు చెందిన మరో స్నేహితుడు చాపల సూర్య ఉమేష్‌చంద్ర(20)తో కలిసి కేశవగోపాలరావు తన ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు ఇంట్లో గడిపిన అనంతరం జగ్గయ్యపేటకు ముగ్గురు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కోటిలింగాల వద్దకు వచ్చే సరికి జగ్గయ్యపేట నుంచి ముక్త్యాలకు వస్తున్న కారు వారి బైక్‌ను వేగంగా ఢీట్టింది. ఈ క్రమంలో కేశవగోపాల్‌, ఉమేష్‌చంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడుపుతున్న రామ్‌చరణ్‌ తీవ్రంగా గాయపడటంతో జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కేశవ్‌గోపాల్‌ (ఫైల్‌) ఉమేష్‌చంద్ర (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement