సరస్‌ మేళాలో మొబైల్‌ ఏటీఎంల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సరస్‌ మేళాలో మొబైల్‌ ఏటీఎంల పరిశీలన

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక పున్నమిఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళాను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. మేళా ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను సందర్శించి, దేశవ్యాప్తంగా వచ్చి స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తుల కళాకారులు ప్రదర్శించిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఆయా ఉత్పత్తుల తయారు చేసే విధానం, నాణ్యత, ధరలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులు, విక్రయదారులతో ముఖాముఖీ సంభాషించారు. అనంతరం మేళాకు వస్తున్న సందర్శకులకు నగదు లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసిన మొబైల్‌ ఏటీఎం వాహనాలను పరి శీలించారు. మేళా ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లు, సందర్శకులకు అవసరమైన మైలిక సదుపాయాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నాంచారరావు, సెర్ప్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement