సిబ్బంది, ప్రయాణికుల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది, ప్రయాణికుల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

సిబ్బంది, ప్రయాణికుల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వేస్టేషన్‌లలో పరిశుభ్రత మెరుగుపర్చడంలో సిబ్బంది నిరంతర కృషితో పాటు ప్రయాణికుల సహకారం ఎంతో ముఖ్యమని దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా అన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు డివిజన్‌లో జరిగిన స్వచ్ఛతా పక్షోత్సవ ప్రచారం ముగింపును పురస్కరించుకుని మచిలీపట్నం రైల్వేస్టేషన్‌లో ‘రైల్‌ జన్‌ సంవాద్‌’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొని రైళ్లు, స్టేషన్‌లలో పరిశుభత్రపై చర్చించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా పాల్గొని ప్రసంగించారు. రైల్వేస్టేషన్‌లు, రైళ్లలో పరిశుభ్రత ప్రాముఖ్యతను సభ్యులకు వివరించారు. రైల్లే పరిసరాల పరిశుభ్రతలో ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం సభ్యుల నుంచి పలు సూచనలు, సలహాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement