నామినేషన్లతో రాజకీయ సందడి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లతో రాజకీయ సందడి

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

వార్డులకు ..

జగ్గయ్యపేటలో మొత్తం 36 వార్డులకు 37 నామినేషన్లు దాఖలవ్వగా వాటిలో శనివారం సీపీఐ 3, టీడీపీ 2, వైఎస్సార్‌ సీపీ 28, జనసేన 1, ఇతరులు 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

తిరువూరులో 28 వార్డులకు శనివారం 65 నామినేషను దాఖలయ్యాయి. సీపీఐ 1, టీడీపీ 38, వైఎస్సార్‌ సీపీ 24, జనసేన 3, ఇతరులు 1 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీకి 67 నామినేషను దాఖలయ్యాయి.

నందిగామలోని 32 వార్డులకు శనివారం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం 2 నామినేషను దాఖలు చేయగా, టీడీపీ 9, వైఎస్సార్‌ సీపీ 25, ఇతరులు 2 నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకు నందిగామలో మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యాయి.

కొండపల్లిలో మొత్తం 40 వార్డులకు శనివారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో సీపీఐ1, సీపీఎం1, టీడీపీ 10 నామినేషన్లు దాఖలు చేసింది. జనసేన–2, ఇతరులు–02 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీలో శనివారంనాటికి మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

విజయవాడ మేయర్‌ స్థానానికి 4 నామినేషన్లు దాఖలు
వార్డులకు ..

పటమట(విజయవాడతూర్పు): జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. విజయవాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న సాధారణ ఎన్నికలకు మేయర్‌ స్థానానికి శనివారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)1 నామినేషన్‌ దాఖలు చేయగా ఇతరుల నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.

కార్పొరేటర్లకు 241 నామినేషన్లు

శనివారం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వీఎంసీ ఏర్పాటు చేసిన 44 ఆర్వో కార్యాలయాల్లో కార్పొరేటర్లకు 241 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ నుంచి 7, సీపీఐ నుంచి 1, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి 3, టీడీపీ నుంచి 84, వైఎస్సార్‌ సీపీ నుంచి 110, జనసేన నుంచి 40, ఆప్‌ నుంచి 1, ఇండిపెండెంట్లు నుంచి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఆయా డివిజిన్లకు దాఖలైన నామినేషన్లు 260 అయ్యాయి.

సర్కిల్‌–1 పరిధిలో..

సర్కిల్‌–1 పరిధిలో మొత్తం 28 డివిజన్లకు శనివారం 72 నామినేషన్లు దాఖలవ్వగా, బీజేపీ 5, సీపీఐ1, కాంగ్రెస్‌2, టీడీపీ14, వైఎస్సార్‌ సీపీ 44, జనసేన 10, ఆప్‌ 1, ఇతరులు 2 నామినేషన్లు వచ్చాయి. ఈ సర్కిల్‌ పరిధిలో 76 నామినేషన్లు దాఖలయ్యాయి.

సర్కిల్‌–2 పరిధిలో..

సర్కిల్‌–2లో 29 డివిజన్లకు 108 నామినేషను దాఖలవ్వగా, కాంగ్రెస్‌ 1, టీడీపీ 44, వైఎస్సార్‌సీపీ 55, జనసేన 09, ఇతరులు 10 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ సర్కిల్‌లో మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి.

సర్కిల్‌–3 పరిధిలో ..

సర్కిల్‌–3 పరిధిలో శనివారం 29 డివిజన్లకు 61 నామినేషన్లు దాఖలవ్వగా వాటిలో బీజేపీ 7, టీడీపీ 29, వైఎస్సార్‌ సీపీ 11, జనసేన 21, ఇతరులు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు సర్కిల్‌ పరిధిలో 65 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు శనివారం చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

జగ్గయ్యపేట టీడీపీ 1, తిరువూరు నుంచి వైఎస్సార్‌ సీపీ 2, నందిగామ నుంచి వైఎస్సార్‌ సీపీ 1, టీడీపీ 1, ఇతరులు నుంచి 1 నామినేషన్‌ దాఖలయ్యాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపాలిటీల్లో 154 నామినేషన్లు వచ్చాయి. సీపీఐ 5, సీపీఎం 3, టీడీపీ 58, వైఎస్సార్‌ సీపీ 77, జనసేన 6, ఇతరులు 4 నామినేషన్‌లను దాఖలు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో మొత్తం 158 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement